నిర్భయ దోషులని ఉరితీసే తలారి ముందు రోజు ఏం చేస్తారో తెలుసా

నిర్భయ దోషులని ఉరితీసే తలారి ముందు రోజు ఏం చేస్తారో తెలుసా

0
157

దేశ వ్యాప్తంగా నిర్భయ నిందితులను ఉరి తీయాలని అందరూ డిమాండ్ చేశారు. చివరకు వీరికి పాటియాలా కోర్టు డెత్ వారెంట్ ఇష్యూ చేసింది.. జనవరి 22న నిర్భయ కేసులో నిందితులకి ఉరిశిక్ష పడనుంది. ఇప్పటికే వారి ఉరిశిక్షకు సంబంధించి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు జైలు అధికారులు. దీనిపై అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు

యూపీలోని మీరట్ వాసి పవన్ జలాద్ వారిని ఉరితీయనున్నాడు,తనకు ఉరితీయడానికి ప్రాక్టీస్ అవసరం లేదని ఉరితాడు తీసే స్దలం ఇస్తే చాలు అని అంటున్నాడు, ముందు ఉరితీసే ప్రాంతాన్ని పరిశీలించాలి అని చెప్పాడు పవన్..
అలాగే ఆ నలుగురు దోషుల ఎత్తు, బరువు వివరాలు కొలతలు తీసుకోవలసి ఉంటుంది.. అని పవన్ జలాద్ వెల్లడించాడు.

ఇక తనకు పిలుపు వస్తుంది అని ఆ సమయంలోఉరితీసే ముందు రోజు అక్కడకు చేరుకుంటాను అన్నాడు.. ముందు డ్రమ్ముల ద్వారా డమ్మీగా ఉరితీస్తారట, తర్వాత అసలు దోషులని ఉరి శిక్ష అమలు చేస్తారట, ముందు ఉరితీసే సమయంలో అక్కడ తాడు ఉరికంబం వారికి కోసం తవ్విన గోతులు అన్నీ ఆయన చూసుకుంటారట అప్పడు వారిని ఉరితీస్తారని తెలియచేశారు.