దేశం అంతా నేడు ఈ వార్త విని ఆనందంలో ఉంది, ఉరిశిక్ష అమలు చేశారు అని తెలియడంతో నిర్భయకు సరైన నివాళి అని నేడు ఆమె ఆత్మశాంతిస్తుంది అని అంటున్నారు, ఈ నలుగురు దోషులకి శిక్ష పడాలి అని ఆమె తల్లి చేసిన కష్టానికి నేడు ప్రతిఫలం దక్కింది.
తమకు న్యాయం జరిగిందని, నిర్భయ ఆత్మకు శాంతి చేకూరిందని నిర్భయ తల్లి ఆశాదేవి అన్నారు. ఈ తెల్లవారుజామున 5:30 గంటలకు దోషులు నలుగురికీ ఉరితీత పూర్తయిన తర్వాత నిర్భయ తల్లి ఆశాదేవి విజయ చిహ్నం చూపిస్తూ సంతోషంగా కనిపించారు. ఈరోజు చాలా ఆనందకరమైన రోజు అని ఆమె అన్నారు.
కుమార్తెని నేను కోల్పోయా.. ఇక నా కూతురు రాదు.. కాని ఇంత కర్కసంగా ఆమెని లేకుండా చేసిన వారికి బతికే హక్కు లేదు అని ఆమె తెలిపింది.దోషులకు ఉరిశిక్ష అమలు జరిగిన వెంటనే తన కుమార్తె ఫొటోను హత్తుకున్నానని ఆశాదేవి ఉద్వేగభరితంగా అన్నారు.సోషల్ మీడియాలో లక్షల కామెంట్లు కూడా వస్తున్నాయి ఈ ఉరి అమలుపై…… నిజమే నిర్భయకు నేడే న్యాయం జరిగింది.