నిర్భయ కేసులో నలుగురు నిందితులు అవయవదానం పై ఏమన్నారంటే

నిర్భయ కేసులో నలుగురు నిందితులు అవయవదానం పై ఏమన్నారంటే

0
95

నిర్భయ కేసులో నలుగురు నిందితులుకి రేపు ఉరి అమలు కానుంది, అయితే ఇక్కడ మరో ట్విస్ట్ వచ్చింది, వారి నలుగురి అవయవాలు దానం చేయాలని ఓ మాజీ న్యాయమూర్తి ఎంఎఫ్ సల్దానా తన పిటిషన్లో కోరారు. దీనిని సుప్రీం కోర్టు తిరస్కరించింది. ఏదైనా శిక్ష ద్వారా ఓ వ్యక్తిని చంపడం వల్ల.. ఆ కుటుంబానికి తీరని శోకాన్ని మిగులుస్తుందని, ఇంకా అవయవదానం అంటే వారి శరీరం ముక్కలు ముక్కలు అవుతుంది అని ఇది సరికాదు అని జడ్జి తెలిపారు.

అయితే మానవత్వంగా ఆలోచిస్తే ఇది కరెక్ట్ కాదు అని… అంతేకాదు, ఒకవేళ వారు నలుగురు స్వచ్చందంగా ఇస్తే ఇవ్వచ్చు అంతేకాని న్యాయస్ధానాలు కోర్టులు ఇలాంటివి నిర్ణయించలేవు అని చెప్పింది సుప్రీం కోర్టు.

అయితే వీరు నలుగురు మాత్రం ఇలా అవయవదానం చేసేందుకు ఇష్టం చూపించడం లేదట, తమకు పడిన శిక్ష ఇక వేసే సమయం వచ్చేసింది అని భయంలో ఉన్నారట, రెండు రోజులుగా వీరిలో వీరే మదనపడుతున్నారట, కాని మరికొన్నిగంటల్లో వారు ఉరికంభం ఎక్కనున్నారు.