నిర్భయ దోషులకుఉరి శిక్ష డేట్ వచ్చేసింది.. ఎక్కడ? ఎప్పుడు?

నిర్భయ దోషులకుఉరి శిక్ష డేట్ వచ్చేసింది.. ఎక్కడ? ఎప్పుడు?

0
91

నిర్బయకు జరిగిన అన్యాయం మరువలేనిది.. ఆమెని అత్యంత దారుణంగా చంపేశారు.. తాజాగా ఈ కేసులో నలుగురు దోషులకు ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు డెత్ వారెంట్ జారీ చేసింది. జనవరి 22న ఉదయం 7 గంటలకు వీరందరినీ ఉరి తీయాలని ఆదేశాలిచ్చింది. దీంతో ఆమెకు ఇన్నాళ్లకు న్యాయం జరిగింది అంటున్నారు కుటుంబ సభ్యులు. నిర్భయ తల్లి చాలా ఆనందం వ్యక్తం చేసింది, ఏడు సంవత్సరాలుగా ఆమె ఈ శిక్ష కోసం తీర్పు కోసం ఎదురుచూస్తున్నారు.

ఈ కేసు వివరాలు చూస్తే , 2012 డిసెంబర్ 16న 23 ఏళ్ల నిర్భయపై నిందితులు అత్యాచారం చేసి అత్యంత కిరాతకంగా వేధించారు తర్వాత ఆమెని రోడ్డుపై వదిలేశారు. 13 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన నిర్భయ, చివరకు 29 డిసెంబర్ 2012న తుదిశ్వాస విడిచింది. అంతేకాదు ఆమె మరణంతో దేశ వ్యాప్తంగా రోడ్లపైకి పెద్ద ఎత్తున ప్రజలు వచ్చారు, మహిళలు ఆ దుర్మార్గులని వెంటనే ఉరితీయాలి అని కోరారు.

ఈ కేసులో మొత్తం ఆరుగురు నిందితులను అరెస్టు చేసి వారిపై అత్యాచారం, హత్యానేరం సహా పలు అభియోగాలు మోపారు పోలీసులు. కాని ఈ సభ్యుల్లో ఒకరు మైనర్ కావడంతో మూడేళ్ల జైలు శిక్ష వేశారు, తర్వాత విడుదలై అజ్ఞాతంలో జీవిస్తున్నాడు. మరో నిందితుడు తీహార్ జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పుడు వీరి నలుగురిని ఉరి తీయాలి అని కోర్టు తీర్పు ఇచ్చింది. వీరి క్షమాబిక్ష పిటిషన్ కూడా రాష్ట్రపతి తిరస్కరించిన విషయం తెలిసిందే.