నిర్భయ దోషులకు చివరి గంటలు.. ఉరి రేపే కోర్టు సంచలన తీర్పు

నిర్భయ దోషులకు చివరి గంటలు.. ఉరి రేపే కోర్టు సంచలన తీర్పు

0
106

ఎట్టకేలకు నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలు కానుంది ఇప్పటి వరకూ తప్పించుకుని న్యాయ లొసుగులని వాడుకుని తప్పించుకున్నారు ఈనలుగురు దుర్మార్గులు.. రెండు సార్లు ఉరిశిక్ష నుంచి తప్పించుకున్నారు.. అయితే ఇక మూడోసారి మాత్రం వీరికి శిక్ష ఖరారు అయింది.

తాజాగా పవన్ గుప్తా.. తనకు వేసిన ఉరిశిక్షను.. యావజ్జీవంగా మార్చాలంటూ దాఖలు చేసిన క్యురేటివ్ పిటిషన్ ని ఈరోజు సుప్రీంకోర్టు కొట్టివేసింది. అంతేకాదు అసలు ఈ పిటీషన్ ఈ విషయం చర్చించాల్సిన అవసరం లేదు అని తెలిపింది,మరోవైపు తమకు విధించిన డెత్ వారెంట్ పై స్టే ఇవ్వాలని పటియాలా కోర్టులో మరో దోషి అక్షయ్ పిటిషన్ వేశాడు దీనిని కూడా కోర్టు నిరాకరించింది, దీంతో వారికి ఉన్న న్యాయ అవకాశాలు అన్నీ దారులు మూసుకుపోయాయి.

దీంతో రేపు ఉదయం వీరు నలుగురిని ఉరి తీయనున్నారు. ఉదయం 6.00 గంటలకు నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలుకానుంది. నలుగురు దోషులను రేపు ఉదయం తీహార్ జైల్లో ఉరి తీయనున్నారు. అన్నీ ఏర్పాట్లు చేయడం పూర్తి అయింది తలారి కూడడా రెండు రోజుల క్రితమే వచ్చేశాడు.దీనిపై నిర్భయ తల్లి చాలా ఆనందంలో ఉన్నారు.