నిర్భయ ట్రీట్మెంట్ లో చెంచా నీరు కూడా ఇవ్వలేదు డాక్టర్ చికిత్స గురించి తల్లి చెప్పిన దారుణమైన విషయాలు

నిర్భయ ట్రీట్మెంట్ లో చెంచా నీరు కూడా ఇవ్వలేదు డాక్టర్ చికిత్స గురించి తల్లి చెప్పిన దారుణమైన విషయాలు

0
105

నిర్బయకు జరిగిన అన్యాయం అసలు ఎవరూ ఊహించలేనిది ,అసలు ఆరోజు ఏం జరిగిందంటే….
ఆమెకి జరిగిన అన్యాయం హస్పటల్ కు వెళ్లేవరకూ తెలియలేదు.. మేము ఆస్పత్రి నుంచి కాల్ రాగానే అక్కడకు చేరుకున్నాం నన్ను నిర్భయ చూసి ఏడ్చేసింది, ఆమె కన్నీరు అంతలా నేను ఎప్పుడూ చూడలేదు..తన శరీరమంతా రక్తంతో తడిసిపోయి ఉంది. నాకు ఒక్కసారిగా ఏం అర్థంకాలేదు. నేర తీవ్రతను కూడా అంచనా వేయలేకపోయాం. అప్పుడే తన మీద ఆరుగురు వ్యక్తులు దాడికి పాల్పడ్డారని చెప్పారు. ఈ మాట వారు చెప్పగానే నేను కూలపడిపోయా

నా కూతురికి ఇంత కష్టం వచ్చింది అని తెలుసుకున్నా.తన పెదాలు చీరుకుపోయి ఉన్నాయి. తన తల మీద చర్మం అంతా ఊడిపోయింది. ఒంటి నిండా కోతలు, గాయాలు, వాటి నుంచి కారుతున్న రక్తం. కొన్నిచోట్ల మాంసం కూడా బయటకు వచ్చింది. తన పరిస్థితి చూసి డాక్టర్లకు కూడా ఏం చేయాలో అర్థం కాలేదు. ట్రీట్మెంట్ ఎప్పుడూ ఇలాంటి వాటికి ఇవ్వలేదు అని వారు కన్నీరు పెట్టుకున్నారు.

ఇరవై ఏళ్ల కెరీర్లో తాను ఎంతో మందిని బతికించాను గానీ…. ఇలాంటి కేసు ఎప్పుడూ చూడలేదని ఓ సీనియర్ డాక్టర్ మాకు చెప్పారు. అంటే నా కూతురి పరిస్థితి ఎంత దారుణంగా అర్థం చేసుకోవచ్చు. కొద్ది రోజులు అలాగే ఆస్పత్రిలో ఉంది.. తనకు స్పృహ వచ్చిన వెంటనే మంచినీళ్లు కావాలని అడిగింది. కానీ డాక్టర్లు అందుకు నిరాకరించారు. చెంచాడు నీళ్లు తాగేందుకు కూడా తన శరీరంలో ఏ వ్యవస్థ సహకరించదని చెప్పారు. ఆమె అలా చికిత్స పొందుతూ చనిపోయింది.