నిర్భయ ఘటన జరిగిన రోజు – నిర్భయ అసలు ఏం చేసింది ఆమె తల్లి చెప్పిన వాస్తవాలు

నిర్భయ ఘటన జరిగిన రోజు - నిర్భయ అసలు ఏం చేసింది ఆమె తల్లి చెప్పిన వాస్తవాలు

0
105

నిర్భయ ఘటన జరిగి ఇన్ని సంవత్సరాలు అయినా ఆమెకు ఇంకా న్యాయం జరగలేదు… న్యాయస్ధానాలలో ఉన్న లోసుగులు వాడుకుని నేడు ఇంత దారుణంగా శిక్ష నుంచి తప్పించుకుంటున్నారు నిందితులు…. కాని ఫైనల్ గా మార్చి 20 న వారికి ఉరి అమలు చేయనున్నారు. అసలు ఆరోజు నిర్భయ ఘటన ఎలా జరిగింది ఆమె ఆరోజు ఏం చేసింది అనేది తల్లి తెలిపారు.

ఆరోజు ఆదివారం. దాదాపు మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో నిర్భయ ఇంటి నుంచి బయటకు వెళ్లింది. రెండు- మూడు గంటల్లో తిరిగి వచ్చేస్తానని చెప్పింది. రాత్రి ఎనిమిది అవుతున్నా తన నుంచి ఎటువంటి సమాచారం రాలేదు. దీంతో తనకు పలుమార్లు ఫోన్ చేశాం. కానీ కాల్ కట్ అయ్యింది. మాకు అనుమానం వచ్చింది, అమ్మాయి దిగే బస్సు అక్కడే అని బస్టాప్ దగ్గరకు నేను నాకొడుకు వెళ్లాము.

అయినా ఆమె ఎక్కడా మాకు తెలియలేదు… దాదాపు రాత్రి 10 గంటలకు అనుకుంటా. నిర్భయ వాళ్ల నాన్న ఇంటికి వచ్చారు. ఆయన కూడా తనకోసం వెదకడం ప్రారంభించారు. పదకొండు గంటల వరకు మేం బయటే నిల్చుని ఉన్నాం. తనకోసం ఎదురుచూస్తున్నాం. ఇంతలో సఫ్దార్జంగ్ ఆస్పత్రి నుంచి కాల్ వచ్చింది. మా ఆయన ఫోన్ ఎత్తగానే.. నిర్భయ ఆస్పత్రిలో ఉందని.. తనకు గాయాలయ్యాయని చెప్పారు. వెంటనే ఆస్పత్రికి వెళ్లాం ఆమెని చూడగానే కన్నీరు తప్ప నాకు ఏమీ లేదు.