తెలంగాణ ప్రజలు గెట్ రెడీ..బోనాలు వచ్చేస్తుంది..సందడి తెచ్చేస్తుంది

0
103

సాధారణంగా రాష్ట్రంలో ఏదైనా పండుగ వస్తే చాలు..గ్రామాల్లో సందడి నెలకొంటుంది. పండగల పేరుతో బంధువులందరూ కలిసి కొత్తచీరలు, పిండివంటలు అని ఇలా రకరకాలుగా చేసుకొని ఆనందంగా జరుపుకుంటారు. ఇందులో ముఖ్యంగా బోనాల పండుగ అంటే ప్రత్యేకమైన విశిష్టత ఉంటుంది. అలాగే ఈ సంవత్సరం కూడా తెలంగాణలో బోనాల జాతర వచ్చేస్తూ..సందడిని తెచ్చేస్తుంది.

సుమారు నెలరోజులపాటు బంధువులు, సన్నిహితులు ఆనందంగా జరుపుకునే ఈ ఆషాడ బోనాల ఉత్సవాలు ఈ నెల 30న గోల్కొండ బోనాలతో ప్రారంభమవుతాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. దాంతో గ్రామాల్లో ప్రజలు పండుగకు కావాల్సిన సన్నాహాలు చేస్తుండడంతో హడావుడి నెలకొంటుంది.

జూన్​ 30- గోల్కొండ బోనాలతో ఆషాడ బోనాలు

జులై 17- ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు

జులై 18- రంగం, భవిష్యవాణి కార్యక్రమం

జులై 24- భాగ్యనగర బోనాలు

జులై 25- ఉమ్మడి దేవాలయాల ఘట్టాలు ఊరేగింపు

జులై 28- గోల్కొండ బోనాలతో ముగియనున్న ఉత్సవాలు