నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన నిర్ణయాలు చట్టాలు ప్రపంచంలో ఎవరూ అమలు చేయరు. అంత కఠినంగా ఉంటాయి. తాజాగా దక్షిణ కొరియాపై కల్చరల్ వార్ కి రంగం సిద్దం చేశారు. కొరియా పాప్ కల్చర్‌ను పూర్తిగా నిషేధించడానికి ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు.
కొరియన్ పాప్ కల్చర్‌ను ఇకపై అక్కడ యువత అవలంభించకుండా చేయనున్నారు. ఈ కల్చర్ కారణంగా నార్త్ కొరియా యువతలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. దీని వల్ల ఇబ్బందులు వస్తాయని భావించి ఆయన దీనికి ఎండ్ కార్డ్ వేస్తున్నారు. అంతేకాదు వందల కోట్ల రూపాయల కొరియన్ మార్కెట్ కు ఇది ఎదురుదెబ్బ అనే చెప్పాలి.
అయితే దీనిపై ఇంటర్ నేషనల్ జర్నల్ లో వార్తలు వస్తున్నాయి. కాని కిమ్ నుంచి అక్కడ వార్త పత్రికలు టీవీలు దీనిపై వార్తలు ఇవ్వలేదు. ఇంటర్నల్ గా దేశంలో ఇది అమలు చేస్తున్నారా, లేదా త్వరలో దీనిపై ప్రకటన వస్తుందా అనేది వేచి చూడాలి.