తిరుమల భక్తులకు గమనిక..రూ. 300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల

0
104

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి దేశవిదేశాల నుండి భక్తులు అధికసంఖ్యలో తరలివస్తున్న క్రమంలో భక్తులు టికెట్లను బుక్‌ చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. శ్రీవారి దర్శనానికి సంబంధించి జులై, ఆగ‌స్టు నెలల రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను మార్చి 21వ తేదీ నుండి వరుసగా రెండు రోజుల పాటు టిటిడి ఆన్ లైన్ లో విడుదల చేయనుంది.

భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. భక్తులు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఆన్‌లైన్‌లో ముందస్తుగా దర్శన టికెట్లను బుక్‌ చేసుకోవాలని తితిదే ప్రజాసంబంధాల అధికారులు  కోర‌డ‌మైన‌ది. భక్తులు ఈ విషయాన్ని గమనించి.. సద్వినియోగం చేసుకోవాలని చెప్పడంతో పాటు..దర్శన సమయంలో భక్తులు కరోనా నిబంధనలు పాటించడం మంచిదని  టీటీడీ కోరుతుంది.