దేశంలో అతిపెద్ద చమురు పంపిణీదారైన ఇండియన్ ఆయిల్ లిమిటెడ్ (IOCL) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ట్రేడ్, టెక్నీషియన్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఆసక్తి కలిగినవారు అప్లయ్ చేసుకోవాలని, ఆన్‌లైన్ దరఖాస్తులు ఈనెల 27 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది.
ఈ నోటిఫికేషన్ ద్వారా 300 అప్రెంటిస్‌లను అందిస్తుంది. ఇవన్నీ దక్షిణాది రీజియన్‌లోని తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పరిధిలో ఖాళీగా ఉన్నాయి. ఇందులో ట్రేడ్ అప్రెంటిస్ ఫిట్టర్, ఎలక్ట్రీటీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, మెషినిస్ట్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్ పోస్టులు ఉన్నాయి.
మొత్తం ఖాళీలు: 300 కాగా ఇందులో తెలంగాణ 60, ఆంధ్రప్రదేశ్ 55, కేరళ 49, కర్ణాటక 52, తమిళనాడు, పాండిచ్చేరి 84 చొప్పున పోస్టులను కేటాయించారు.
అర్హతలు: పదో తరగతి, ఐటీఐ, ఇంటర్, డిగ్రీ చేసి ఉండాలి. అభ్యర్థులు 18 నుంచి 24 ఏండ్ల మధ్య ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష ద్వారా
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
దరఖాస్తులకు చివరితేదీ: డిసెంబర్ 27
రాతపరీక్ష: 2022, జనవరి 9
వెబ్‌సైట్: https://www.iocl.com/apprenticeships