రైల్వే పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..పూర్తి వివరాలివే..

Notification for replacement of railway posts..full details are ..

0
100

భారతీయ రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా. అయితే మీకు శుభవార్త. ఇండియన్ రైల్వేలో భాగమైన సౌత్‌ ఈస్టర్న్‌ రైల్వేలో ఖాళీగా ఉన్న గూడ్స్‌గార్డ్‌ పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

ఆసక్తి కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఈనెల 23 వరకు అందుబాటులో ఉంటాయి. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 520 పోస్టులను భర్తీ చేస్తుంది. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనుంది. ఎంపికైన వారు కోల్‌కతా కేంద్రంగా పని చేయాల్సి ఉంటుంది.

మొత్తం పోస్టులు: 520

ఇందులో జనరల్‌ 277, ఓబీసీ 87, ఎస్సీ 126, ఎస్టీ 30 చొప్పున ఖాళీలు ఉన్నాయి.

అర్హతలు: పదో తరగతి ఉత్తీర్ణులై 42 ఏండ్లలోపువారై ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్‌ ఆధారిత రాతపరీక్ష.

పరీక్ష మొత్తం 100 మార్కులకు ఉంటుంది.

ఇందులో జనరల్‌ అవేర్‌నెస్‌, అరిథ్‌మెటిక్‌, జనరల్‌ ఇంటెలిజెన్స్‌, రీజనింగ్‌ నుంచి ప్రశ్నలు అడుగుతారు. ప్రతి తప్పు సమాధానానికి 1/3 వంతు మార్కులు కోత విధిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో

దరఖాస్తులకు చివరితేదీ: డిసెంబర్‌ 23

వెబ్‌సైట్‌: https://www.rrcser.co.in