తెలంగాణలో ఆ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..పూర్తి వివరాలివే..

Notification for the replacement of those jobs in Telangana .. Full details are ..

0
119

తెలంగాణలో ఉద్యోగాల జాతర మొదలుకానుంది. అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆరే ఉద్యోగాల ప్రకటన చేశారు. దీనితో ఒకేసారి 80,039వేలకు పైగా ఉద్యోగ ఖాళీలకు నోటిఫికేషన్లు త్వరలోనే రానున్నాయి. ఇప్ప‌టికే రాష్ట్రంలోని అన్ని శాఖ‌ల‌లో ఉన్న ఉద్యోగ ఖాళీల వివరాల‌ను సైతం విడుద‌ల చేశారు. జిల్లాలు, జోన‌ల్, మ‌ల్టీ జోన‌ల్ లో చొప్పున‌ ఉన్న ఖాళీల వివ‌రించారు. అతి త్వ‌ర‌లోనే ఉద్యోగ భ‌ర్తీకి నోటిఫికేషన్లు విడుద‌ల అవుతాయ‌ని కూడా ప్ర‌క‌టించారు.

ఈ నేపథ్యంలో రాష్ట్ర సచివాలయంలో 250 అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ ఖాళీలను సంబంధిత శాఖ గుర్తించింది. ఇందులో 150 పోస్టులను ప్రభుత్వం ప్రకటించిన ఉద్యోగ నియమాకాల్లో భాగంగా TSPSC గ్రూప్‌-2 (Group-2) ద్వారా భర్తీ చేస్తారు. మిగిలిన 100 పోస్టులను పదోన్నతులు, కారుణ్య నియమాకాలతో పాటు 12.50 శాతం కోటా కింద శాఖాధిపతుల కార్యాలయాల ద్వారా బదిలీ అయ్యే వారికి కేటాయించింది. అయితే రాష్ట్రంలో కొత్త ఉద్యోగ నియమాకాల కోసం అభ్యర్థులు గరిష్ఠ వయోపరిమితి పెంపుపై త్వరలో ఉత్తర్వులు జారీ కానున్నాయి.

అయితే, రాష్ట్రంలో కొత్త ఉద్యోగ నియమాకాల కోసం అభ్యర్థులు గరిష్ఠ వయోపరిమితి పెంపుపై త్వరలో ఉత్తర్వులు జారీ కానున్నాయి. ‘పోలీసు వంటి యూనిఫాం సర్వీసులకు మినహా, ఇతర పోస్టులకు గరిష్ఠ వయోపరిమితిని పదేళ్ల పాటు పెంచుతున్నాం’ అని అన్నారు. ప్రస్తుతం ఓసీలకు గరిష్ట వయోపరిమితి 34 ఏళ్లు ఉండగా, దానిని 44కు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 39 ఏళ్లు ఉండగా, దానిని 49కి, ఇక దివ్యాంగులకు 44 నుంచి 54 ఏళ్లు వయోపరిమితి పెంచనున్నట్లు తెలిపారు.