24 ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసర్‌ పోస్టుల భర్తీ..పూర్తి వివరాలివే..!

0
111

నిరుద్యోగులకు మరో చక్కని అవకాశం. ఇప్పటికే పోలీస్, ఫారెస్ట్, ఫైర్‌, జైళ్లు, రవాణా, ఎక్సైజ్‌, పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌, సాంఘిక సంక్షేమం, విద్య, వైద్యారోగ్య శాఖలతోపాటు ఇంజినీరింగ్‌ విభాగాల్లో ఉద్యోగాల భర్తీ కొనసాగుతున్న విషయం తెలిసిందే.

తాజాగా..రాష్ట్ర వైద్యారోగ్యశాఖలో 24 ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ మేరకు టీఎస్పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్‌ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆసక్తి, అర్హత ఉన్నవాళ్లు అప్లై చేసుకోవచ్చు.

భర్తీ చేయనున్న ఖాళీలు: 24

పోస్టుల వివరాలు: ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసర్‌ పోస్టులు

దరఖాస్తు ప్రారంభ తేదీ:  ఈ నెల 29 నుంచి ఆగస్టు 26 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.

ఇతర వివరాలకు www.tspsc.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.