దేశ రాజధాని ఢిల్లీ పోలీస్ విభాగంలో పలు పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ కు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
మొత్తం 4300 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
వీటిలో ఢిల్లీ పోలీసు విభాగంలో సబ్-ఇన్‌స్పెక్టర్(పురుషులు) (228)
ఢిల్లీ పోలీసు విభాగంలో సబ్-ఇన్‌స్పెక్టర్(మహిళలు) (112)
సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీసు ఫోర్సు(సీఆర్‌పీఎఫ్)లో సబ్-ఇన్‌స్పెక్టర్(జీడీ) (3960) ఖాళీలు ఉన్నాయి.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ లేదా తత్సమానం ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
అభ్యర్థుల వయసు 01-01-2022 నాటికి 20 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
అభ్యర్థులను రాత పరీక్ష (పేపర్-1, పేపర్-2), ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (పీఎస్‌టీ)/ ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ (పీఈటీ), మెడికల్ ఎగ్జామినేషన్ (డీఎంఈ), సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
తెలుగు రాష్ట్రాల్లో గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ, చీరాల, విజయనగరం, హైదరాబాద్, వరంగల్, కరీంనగర్‌లో ఎగ్జామ్ సెంటర్స్ ఏర్పాటు చేయనున్నారు.
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీగా 30-08-2022న నిర్ణయించారు. పరీక్ష షెడ్యూల్‌ను 2022 నవంబర్‌లో విడుదల చేయనున్నారు.