ఓ ప్రాంక్ కాల్ తో తండ్రి ప్రాణం పోయింది – ఎంత దారుణం జరిగిందంటే

ఓ ప్రాంక్ కాల్ తో తండ్రి ప్రాణం పోయింది - ఎంత దారుణం జరిగిందంటే

0
97

వెనిస్ లో జార్జ్ అతని భార్య ఎంతో ప్రేమగా తన కుమార్తె జూలీని పెంచుకుంటున్నాడు.. అయితే తల్లిదండ్రులు ఏది కావాలి అంటే అది ఆమెకి ఇస్తున్నారు.. ఇక ప్లస్ 2 చదువుతున్న ఆమెని డాక్టర్ ని చేయాలి అని భావిస్తున్నారు పేరెంట్స్.. కాని ఓరోజు ఆమె తండ్రికి ఓ వాట్సాప్ మెసేజ్ వచ్చింది..అందులో అతని కుమార్తె బాయ్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకుని రింగ్ తొడిగిన ఫోటో ఉంది.

 

ఆ వెంటనే ఆమె కాల్ చేసి నేను పెళ్లి చేసుకున్నా అని చెప్పింది..దీంతో అతను ఒక్కసారిగా షాక్ అయ్యాడు.. అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.. గుండె నొప్పి రావడంతో అతన్ని ఆస్పత్రికి చేర్చారు.. అరగంట తర్వాత అతను చనిపోయాడు.. అయితే ఇక్కడ అసలు విషయం ఏమిటి అంటే ..అది నిజం పెళ్లికాదు తల్లిదండ్రులు ఏమంటారా అని ఓ ప్రాంక్ కాల్ మెసేజ్ చేసింది. చివరకు దారుణం జరిగింది.

 

అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేశారు పోలీసులు… ఇలాంటి పనులు చేయకండి అని యువతకు తెలియచేస్తున్నారు, ఆమె చేసిన పనికి కుటుంబం అంతా కన్నీరు మున్నీరు అవుతున్నారు…. కుమార్తెపై అంత ప్రేమ పెంచుకున్నందుకు తండ్రికి ఇలాంటి బహుమతి ఇచ్చింది అని బాధపడుతున్నారు ఆ కుటుంబ సభ్యులు.