ఒక్క మెసేజ్ ఆ అక్కా చెల్లెల్ల జీవితాలని నాశనం చేసింది

ఒక్క మెసేజ్ ఆ అక్కా చెల్లెల్ల జీవితాలని నాశనం చేసింది

0
128

ప్రేమించడం తప్పుకాదు, అయితే ఆ ప్రేమని పెద్దల వరకూ చెప్పి వారి ఇష్టంతో ఒకటి అయితే ఏ కుటుంబానికి ఇబ్బంది ఉండదు, చివరకు కొందరు అయితే గర్భవతి అయిన తర్వాత ఇంటిలో చెబుతున్నారు, దీని వల్ల పరువు పోతోంది అని పెద్దలు చనిపోతుంటే, ఆ పిల్లలు కూడా ఆత్మహత్య చేసుకుంటున్నారు.

అయితే భోపాల్ లో ఓ దారుణం జరిగింది, ఎంతో సరదాగా ఉండే కుటుంబం అది, అక్కా చెల్లెల్లు స్ధానికంగా ఉండే ఇద్దరు కుర్రాళ్లతో చనువుగా ఉండేవారు, వారితో ప్రేమలో పడ్డారు, ఆ ఇద్దరు యువకులు ఈ ఇద్దరు అక్కాచెల్లెల్లు సినిమాలు పార్కులు అన్నీ తిరిగారు , అయితే వారి ప్రేమ గురించి ఇంట్లో చెప్పలేదు.

వీరిలో ఒకరి బాయ్ఫ్రెండ్.. తాను మీ అమ్మాయిని ప్రేమిస్తున్నట్లు ఆమె తండ్రికి మేసేజ్ పంపాడు. ఈ సందేశాన్ని ఇంట్లో వారంతా చూశారు. తమ ప్రేమ ఇంట్లో తెలిసిందని తీవ్ర ఆందోళనకు గురయ్యారు అమ్మాయిలు.. దీంతో ఆ ఇద్దరు అమ్మాయిలు గ్రామానికి సమీపంలో ఉన్న బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఆ బాయ్ ప్రెండ్ పై కేసు నమోదు చేశారు పోలీసులు .