ఒకే ఇంటిలో భార్య ప్రియురాలు చివరకు దారుణం జరిగింది

ఒకే ఇంటిలో భార్య ప్రియురాలు చివరకు దారుణం జరిగింది

0
113

ఒకే ఒరలో రెండు కత్తులు ఉండలేవు, ఒకే ఇంటిలో భర్తతో ఇద్దరు భార్యలు ఉండలేరు, కాని ఓ వ్యక్తి ఒకే ఇంటిలో ఇద్దరు భార్యలతో కొంత కాలం కలిసి ఉన్నాడు, కాని తర్వాత సీన్ మారిపోయింది, ఏకంగా మర్డర్ వరకూ వెళ్లింది.. అసలు జరిగిన ఘటన వివరాలు చూస్తే, జార్ఖండ్కి చెందిన మహమ్మద్ రివాని, షకీలా బీబీ దంపతులు. బతుకుదెరువు కోసం పంజాబ్కి వలసవచ్చి లుధియానా ప్రాంతంలో ఉంటున్నారు.

ఇక రివానీ రెండో వివాహం చేసుకున్నాడు షకీలాని, ముందు కొంత కాలం బాగానే ఉన్నారు, కాని ఈ సమయంలో మరో వివాహం చేసుకుని ఆమెని కూడా ఇంటికి తీసుకువచ్చాడు, ఇక భార్యలు ఇద్దరూ కొంత కాలం కలిసి ఉన్నారు, కాని ఈ సమయంలో మూడో వివాహం చేసుకున్న ఆమె బంధువులు వచ్చి ఆమెని ఇంటికి తీసుకువెళ్లిపోయారు.

దీంతో అప్పటి నుంచి రెండో భార్యని హింసించాడు, ఇద్దరి మధ్య వివాదం జరిగింది, చివరకు ఆమెని చంపేసి బావిలో పడేసి తన సొంత ఊరు పారిపోయాడు, మూడు రోజుల తర్వాత ఆమె శవం తేలడంతో పోలీసులకి సమాచారం అందించారు స్ధానికులు, చివరకు భర్త ఫోన్ స్విఛ్చాఫ్ , అతనే ఈ దారుణం చేసి ఉంటాడు అని ప్రాధమిక ఆధారాలతో విచారణ చేస్తున్నారు పోలీసులు.