కొద్దిరోజులక్రితం తెలంగాణలో దిశ సంఘటన జరిగిన తర్వాత ఏపీలో మహిళలకు రక్షణగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిశ 2019 యాక్ట్ ను తీసుకువచ్చారు… ఎవరైనా మహిళలపై అసభ్యంగా ప్రవర్తిస్తే ఆ వ్యక్తికి దిశ యాక్ట్ ప్రకారం కఠిన చర్యలు తప్పవని తెలిపింది…
అయినా కూడా కామంధుల్లో మార్పు రాకుంది… ఏపీలో ఆడావారిపట్ల అఘాయిత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి… తాజాగా ఏపీలో మరోదారుణం జరిగింది… నాలుగేళ్ల చిన్నారిపై ఓ వ్యక్తి అత్యారానికి పాల్పడ్డాడు… ఈ దారుణం పశ్చిమగోదావరిజిల్లా కామవరపుకోటలో జరిగింది…
నాలుగేళ్ల బాలిక స్కూల్ లో ఆడుకుంటుండగా పోట్లూరి అంజయ్య అనే వ్యక్తి ఎత్తుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు… ఈ ఘటనపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు వారి ఫిర్యాదు మేరకు పోలీసులు ఫోక్సో చట్టం కింద అంజయ్యపై కేసు నమోదు చేశారు