విశాఖ నగరాన్ని వరుస ప్రమాదాలు వెంటాడుతున్నాయి… అర్థరాత్రి పరవాడ పార్మాసిటీలోని విశాఖ సాల్వెంట్ లో రసయాన పదార్థల ట్యాంకులు పేలడంతో భారీగా మంటలు చలరేగాయి… ఈ ప్రమాదంలో ఒకరు చనిపోయారు… అగ్నిమంటల్లో చిక్కుకుని ఒకరు మరణించారు… మరో నలుగురికి తీవ్రగయాలు అయ్యాయి…
వారిని గాజువాకలోని ఒక ఆసుపత్రికి తరలించారు… పార్మీసిటీలోని రామ్ కీ సీఈ టీపీలోని రాత్రి 11 గంటల సమయంలో రసయాన ట్యాంకులు పేలడంతో భారీగా మంటలు ఎగసి పడ్డాయి… దట్టమైన పోగలు ఆప్రాంతాన్ని కమ్మేశాయి..
చుట్టుపక్కల ఐదు కిలోమీటర్ల వరకు మంటలు వ్యాపించాయి… ప్రస్తుతం పూర్తి స్థాయిలో కెమికల్ రియాక్షన్ జరుగకుండా అదనపు ఫైర్ ఇంజన్లు రంగంలోకి దిగాయి… ఎల్జీ పాలిమర్స్ ఘటన మరువక ముందే సైనార్ కెమికల్ లో ప్రమాదం జరగడం ఆ తర్వాత తాజా అగ్ని ప్రమాదం జరగడంతో విశాఖ వాసులు బెంబేలెత్తిపోతున్నారు…