ఒక్క మిస్డ్ కాల్ ఆమె జీవితాన్ని మార్చేసింది – యువ‌త జాగ్ర‌త్త

ఒక్క మిస్డ్ కాల్ ఆమె జీవితాన్ని మార్చేసింది - యువ‌త జాగ్ర‌త్త

0
171

ఒక్కోసారి మ‌నం ఫోన్ వాడుతున్న స‌మ‌యంలో మిస్ట్ కాల్స్ వ‌స్తూ ఉంటాయి.. ఎవ‌రా అని మ‌నం తిరిగి రివ‌ర్స్ కాల్ చేస్తాం ,ఇలా చేసిన స‌మ‌యంలో అవ‌త‌ల నుంచి అమ్మాయిలు మాట్లాడి రాంగ్ నెంబ‌ర్ అని చెబితే ఒకే అని క‌ట్ చేస్తాం.. కాని కొంద‌రు అలా కాదు ఆ అమ్మాయితో మాట్లాడ‌టం స్టార్ట్ చేస్తారు.

ఇలా రిలేష‌న్ పెంచుకుని అక్ర‌మ సంబంధాలు పెట్టుకున్న కొంద‌రు ప్ర‌బుద్దులు ఉన్నారు,చివ‌ర‌కు ఇద్ద‌రి కుటుంబాలు చిన్నాభిన్నం అయిన సీన్లు ఉన్నాయి. ఇలా ఓ వివాహిత మిస్డ్ కాల్ తో ప్రేమలో పడి తన ఇద్దరు పిల్లలను సైతం విడిచి వెళ్ళిపోయింది.

తమిళనాడులోని నెల్‌లై జిల్లా సేరన్‌ మహాదేవిలోచోటు చేసుకుంది. ఈ మహిళకు మిస్డ్ కాల్ లో కాయత్తార్‌కి చెందిన 24 ఏళ్ల యువకుడితో పరిచయం ఏర్పడింది. కొద్ది కాలానికి ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. దాంతో మహిళ యువకుడిని పెళ్లి చేసుకోలేవాలని నిశ్చయించుకుంది. ప‌దేళ్ల క్రితం పెళ్లి అయినా స‌రే భ‌ర్త‌ని ఇద్ద‌రి పిల్ల‌ల‌ని వ‌దిలి అత‌నితో పారిపోయింది.

అయితే ఆ యువ‌కుడికి మాత్రం త‌న‌కు పెళ్లి కాలేదు అని చెప్పి న‌మ్మించింది. పెళ్లితరవాత ఆమె తన పెళ్లి ఫోటోలను వాట్సప్ స్టేటస్ గా పెట్టడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఆమెను, పెళ్లి చేసుకున్న యువకుడిని పిలిపించి విచారించారు. దీంతో ప్రియుడు కూడా ఆమె న‌న్ను మోసం చేసింది అని వ‌దిలి వెళ్లిపోయాడు భ‌ర్త వ‌దిలేశాడు, చివ‌ర‌కు ఆమె ఒంట‌రిది అయింది.