మామూలుగా ఓ ఫోటో తీసేందుకు ఎంత సమయం పడుతుంది. మా అంటే కొన్ని సెకన్లు లేదంటే ఓ నిమిషం. ఒక్క క్లిక్ తో చాలా ఫోటోలు తియొచ్చు. కానీ ఓ ఫోటోగ్రాపర్ తీసిన ఫొటోకు పట్టిన విషయం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
వివరాల్లోకి వెళితే..కెన్యాకు చెందిన వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ పాల్ గోల్డస్టెయిన్ తీసిన ఓ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కెన్యాలోని మసాయి మారా నేషనల్ పార్కులో మూడు చిరుత పులులు మూడు వైపులకు చూస్తుండగా తన కెమెరాతో క్లిక్ అనిపించాడు. ఈ క్షణం కోసం అతడు 7 గంటలు వర్షంలో తడుస్తూ ఎదురుచూశాడు. అతడి శ్రమ ఫలించి ప్రస్తుతం అనేక మంది నుంచి ప్రశంసలు అందుకుంటున్నాడు.