గుడ్ న్యూస్ – రూపాయికే బైక్ అదిరిపోయే బంపర్ ఆఫర్

గుడ్ న్యూస్ - రూపాయికే బైక్ అదిరిపోయే బంపర్ ఆఫర్

0
117

బైక్ కొనాలి అనుకుంటే కచ్చితంగా ఈ వార్త తెలుసుకోండి, ఇప్పుడు బైక్ ధరలు ఆకాశాన్నంటాయి, అయితే బైక్ ధరలు ఇలా ఉంటే కచ్చితంగా చాలా మంది సగం నగదు ముందు కట్టి తర్వాత ఈఎంఐ ఆప్షన్ పెట్టుకుంటున్నారు, అయితే ఇప్పుడు ఇంకా సరికొత్త ఆఫర్ వస్తోంది.

బ్యాంక్ డెబిట్ కార్డుపైనే ఈఎంఐ ప్రయోజనాన్ని కల్పిస్తోంది.ఈ బ్యాంక్ డెబిట్ కార్డు ఉంటే సులభంగానే నచ్చిన టూవీలర్ను ఇంటికి తీసుకెళ్లొచ్చు.ప్రముఖ బ్యాంక్ ఫెడరల్ బ్యాంక్ తాజాగా ఈఎంఐ ఫెసిలిటీ ఆప్షన్ అందుబాటులోకి తీసుకువచ్చింది. కచ్చితంగా మీకు డెబిట్ కార్డ్ ఉండాలి, మీరు మీ డెబిట్ కార్డు ద్వారా బైక్ కొనుగోలు చేయవచ్చు.

డెబిట్ కార్డు ద్వారా ఈఎంఐ ఆప్షన్లో కొత్త టూవీలర్ కొనుగోలు చేయొచ్చు. అయితే బైక్ కంపెనీలు హీరో మోటొకార్ప్, హోండా మోటార్సైకిల్స్, టీవీఎస్ మోటార్ షోరూమ్లకు వెళ్లి కేవలం రూ.1 చెల్లించి కొత్త వెహికల్ను ఇంటికి పట్టుకెళ్లొచ్చు. ఇక ముందు ఈ రూపాయి పే చేసి మీరు బైక్ తీసుకోవచ్చు, తర్వాత నెల నుంచి క్రమంగా ఈఎంఐ కట్టాల్సి ఉంటుంది…

ఈఎంఐ ప్రాసెస్ మొత్తం ఆన్లైన్లోనే పూర్తవుతుంది. రుణాన్ని 3 నుంచి 12 నెలలోగా తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఇక ప్రాసెసింగ్ ఫీజు అసలు లేదు…మీరు హోండా మోటార్సైకిల్ తీసుకుంటే, మీకు ఫెస్టివ్ ఆఫర్ కింద 5 శాతం క్యాష్బ్యాక్ కూడా లభిస్తోంది. మీకు అర్హత ఉందా లేదా అనేది ఇలా తెలుసుకోండి
డీసీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఈఎంఐ అని టైప్ చేసి 5676762 నెంబర్కు ఎస్ఎంఎస్ పంపాలి. లేదంటే 7812900900 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వాలి.