ఆన్ లైన్ లో చాలా సంస్ధలు ఇప్పుడు ఫుడ్ డెలివరీ చేస్తున్నాయి, ఉద్యోగులు కూడా మంచి సర్వీస్ అందిస్తున్నారు, కాని కొందరు చేసే పని వల్ల ఎంతో మైనస్ అవుతోంది, అయితే ఇప్పుడు
కస్టమర్లకు ఇవ్వాల్సిన ఆహార ప్యాకెట్లను జాగ్రత్తగా కట్ చేసి, ఫుడ్ ను దొంగిలించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొందరు అవి సగం తిని మళ్లీ ప్యాక్ చేసిన వీడియోలు చూశాం.
ఈ కరోనాతో చాలా మంది ఫుడ్ ఆర్డర్ చేసేవారు, నో కాంటాక్ట్ డెలివరీకి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు, ఇక డెలివరీ బాయ్స్ ఇంటికి ఆహారం తెచ్చి డెలివరీ పెట్టి వెళ్లిపోతున్నారు, బెల్ కొట్టి అక్కడ డెలివరీ చేసినట్లు ఫోటో కూడా తీసి పెడుతున్నారు.
.
సాక్ష్యంగా, వారు ఓ ఫొటో తీసుకుని వెంటనే తాము పనిచేస్తున్న సంస్థ యాప్ లో అప్ లోడ్ చేయాల్సి వుంటుంది, తాజాగా ఓ అమ్మాయి ఇలా డెలివరీ ఇచ్చి అక్కడ ఫోటో తీసి తర్వాత మళ్లా ఆఫుడ్ ని ఆమె తీసుకువెళ్లింది, చూశారా ఎంత మోసం చేస్తున్నారో, చివరకు ఫుడ్ ఇచ్చిన ఆమె సీసీ కెమెరా చూస్తే ఈ డెలివరీ అమ్మాయి చేసిన పని బయటపడింది.
మీరు ఆ వీడియో చూడండి