బ్రేకింగ్: దేశప్రజలకు ఊరట..భారీగా తగ్గిన సిలిండర్ ధర

0
102

దేశంలో కరోనా సంక్షోభం కారణంగా ప్రజలు ఆర్థిక ఇబ్బందులు పడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న క్రమంలో నిత్యావసర సరుకుల ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి సామాన్యప్రజలపై అదనపు భారం వేయడంతో  తీవ్ర ఇబ్బందులు  పడుతున్నారు. అయితే ప్రస్తుతం ప్రజలపై కేంద్రప్రభుత్వం కాస్త కనుకరించి గ్యాస్ సిలిండర్ ధరపై భారీ తగ్గింపు ప్రకటించాయి.

కానీ ఆ తగ్గింపు కేవలం కమర్షియల్ గ్యాస్ సిలిండర్ కు మాత్రమే వర్తిస్తుంది. ఈరోజు నుంచి 19 కేజీల సిలిండర్ రేటు రూ. 135 మేర దిగివచ్చినట్టు ఇంధన తయారీ సంస్థలు తెలిపాయి. తాజా తగ్గింపుతో దిల్లీలో 19 కేజీల వాణిజ్య సిలిండర్‌ ధర రూ.2,335.50 నుంచి రూ.2,219కు దిగిరాగా..ముంబయిలో ఈ సిలిండర్‌ ధర రూ.2,171.50, కోల్‌కతాలో రూ.2,322, చెన్నైలో రూ.2,373గా ఉంది. హైదరాబాద్‌లో ఈ సిలిండర్‌ ధర రూ.2,427.50కు తగ్గింది.