అతిరథ మహారథుల సమక్షంలో ఘనంగా ప్రారంభమైన శ్రీరామ్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ వారి నూతన కార్యాలయం!!

-

నిర్మాణ రంగంలో అగ్రగామి గా దూసుకెళ్తూ కొనుగోలుదారులకు విశేషంగా ఆకర్షిస్తున్న శ్రీరామ్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ వారు తాజాగా ఎస్ ఆర్ నగర్ లో కొత్త ఆఫీస్ ను ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీ ఆర్ ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ దినేష్ చౌదరి, తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ చైర్మన్ పాటిమీది జగన్మోహన్ రావు గారు లు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ప్రత్యేక ఆకర్షణగా హీరోయిన్ ఆకాంక్ష ప్రసాద్ హజరయ్యింది. పలు ఆకర్షణీయ, తక్కువ ధరలో అందించే వెంచర్స్ ను నిర్మించే శ్రీరామ్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ వారు ఇప్పుడు మరికొన్ని మంచి వెంచర్స్ ను రూపొందించారు.

- Advertisement -

ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీ ఆర్ ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ దినేష్ చౌదరి మాట్లాడుతూ.. శ్రీరామ్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ వారి నూతన కార్యాలయం ప్రారంభోత్సవానికి వచ్చినందుకు సంతోషంగా ఉంది. నాతో పాటు తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ చైర్మన్ పాటిమీది జగన్మోహన్ రావు గారు , సతీష్ రెడ్డి గారు రావడం జరిగింది. శ్రీరామ్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ ఇంకా వృద్ధి లోకి రావాలని, మంచి వెంచర్స్ ప్రజలకు అందజేయాలని కోరుకుంటున్నాం. అని అన్నారు.

తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ చైర్మన్ పాటిమీది జగన్మోహన్ రావు గారు మాట్లాడుతూ.. శ్రీరామ్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ నూతన కార్యాలయ ప్రారంభోత్సవం కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు. చాలా రోజులుగా శ్రీరామ్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ మంచి అనుబంధం ఉంది. బాగా కష్టపడే వ్యక్తిత్వం కలవారు. ఈ సంస్థ ముందు ముందు ఇంకా అభివృద్ధి లోకి రావాలని ఆశిస్తున్నాను అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...