ఓయూలో ఉద్యోగిని మృతి..పాము కాటుతో..

0
133

ఓయూలో ఓ ఉద్యోగిని మృతి కలకలం రేపుతోంది. నిత్యం ఓయూ లేడీస్ హాస్టల్లో పాములు హల్ చల్ చేస్తున్నాయి. అయినా కానీ  ఓయూ, కాంట్రాక్టర్స్ యజమాన్యం పట్టించుకోలేదు.

ఇక తాజాగా ఓ ఉద్యోగిని పాము కాటు వేసింది. అయిన అక్కడి సిబ్బంది మాత్రం పట్టించుకోలేదు. దీనితో ఆ మహిళే స్వయంగా ఆసుపత్రికి వెళ్ళింది. పలు ఆసుపత్రులు తిరిగిన, ప్రాణం దక్కలేదు. గాంధీ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లిన గంటల్లోనే ఓయూ మహిళ ఉద్యోగిని కవిత మృతి చెందింది. సమాచారం బయటకు రాకుండా  ఓయూ ఉద్యోగులు, కాంట్రాక్టర్స్ దాచినట్లు తెలుస్తుంది.

ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. మృతురాలు కవిత కుటుంబానికి న్యాయం చేయాలని, మహిళా ఉద్యోగిని కుటుంబానికి 50 లక్షలు నష్టపరిహారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ ఘటనకు నిరసనగా లేడీస్ హాస్టల్ ముందు నిరసన, ధర్నాకు  విద్యార్థి సంఘాలు, జాక్ నేతలు సిద్ధమవుతున్నారు.