పదేళ్ల కుర్రాడు చేసిన పనికి షాకైన బ్యాంకు సిబ్బంది – జాగ్రత్త

పదేళ్ల కుర్రాడు చేసిన పనికి షాకైన బ్యాంకు సిబ్బంది - జాగ్రత్త

0
79

ఓ పదేళ్ల కుర్రాడు అంటే సరదాగా ఆడుకుంటాడు స్కూల్ గేమ్స్ ఇవే అనుకుంటాం.. కాని ఇక్కడ ఈ కుర్రాడు చేసిన పని తెలిస్తే మతిపోతుంది, కేడీలే షాక్ అవుతున్నారు..మధ్యప్రదేశ్లో ఇటీవల 10 ఏళ్ల కుర్రాడు..30 సెకెన్లలో చేసిన పని తెలిసి అందరూ షాక్ అయ్యారు.

ఓ పదేళ్ల కుర్రాడు..పట్ట పగలు..అందరి కళ్లూ కప్పి ఏకంగా 10 లక్షల రూపాయల బ్యాంకు సొమ్మును దోచేశాడు.ఓ పదేళ్ల కుర్రాడు ఓ యువకుడితో బ్యాంకుకు వచ్చాడు, అందరూ ఎవరి పనిలో వారు ఉన్నారు క్యాషియర్ ఈ సమయంలో పక్కకు వెళ్లాడు.

వెంటనే క్యాబిన్ లో దూరి అక్కడ ఉన్న 500 రూపాయల నోట్ల కట్టలు తన బ్యాగులో వేసుకున్నాడు, వాటిని తీసుకుని బ్యాగ్ తో సైలెంట్ గా బయటకు వెళ్లిపోయాడు, తర్వాత క్యాషియర్ కు నగదు లేకపోవడంతో సీసీ కెమెరాలు చూశారు. ఈ బుడ్డోడు చేసిన పని తెలిసి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు, పోలీసులు వారి కోసం వెతుకుతున్నారు. ఈ ఘటన బోపాల్ నీమచ్ జిల్లాలోని జరిగింది.