పక్కా ప్లాన్ తో భర్తను ప్రియుడితో కలిసి హత్య చేయించిన భార్య..

పక్కా ప్లాన్ తో భర్తను ప్రియుడితో కలిసి హత్య చేయించిన భార్య..

0
78

పచ్చని కాపురంలో నిప్పులు పోసుకుంది ఓ వివాహిత మహిళ… పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి… కడప జిల్లాకు చెందిన ఒక వ్యక్తి చిత్తూరు జిల్లా మదనపల్లి ప్రాంతానికి చెందిన ఒక మహిళను వివాహం చేసుకున్నారు… వీరిద్దరు అప్పటికే ప్రేమించుకున్నారు కూడా… భర్త తిరుపతిలో జాబ్ చేస్తూ కుటుంబానికి దూరంగా ఉంటున్నాడు..

ఈ క్రమంలో భార్యకు మరో వ్యక్తితో పరిచయం అయ్యాడు… ఈ పరిచయం కాస్త వివాహేతర సంబంధంగా మారింది… ఈ విషయం భర్తకు తెలియడంతో మందలించారు…. తనన భర్త వేధిస్తున్నాడని ఎలాగైనా వదించుకోవాలని ప్రియుడితో కలిసి ప్లాన్ వేసింది… లాక్ డౌన్ ఉన్నప్పటికీ సిమెంట్ లారీతో హత్య చేయించింది..

పథకం ప్రకారం తనకు జ్వరంగా ఉందని మందులు తీసుకు రావాలని భర్తను మెడికల్ స్టోర్ కు పంపించింది… దీంతో భైక్ పై వెళ్లిన అతన్ని లారీతో ఢీ కొట్టించింది…ఇక భర్త సోదరుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ చేపట్టారు దీంతో అసలు విషయం బయటపడింది…..