పాన్ కార్డు పోయిందా డూప్లికేట్ ఇలా అప్లై చేసుకోండి ఈజీ ప్రాసెస్

పాన్ కార్డు పోయిందా డూప్లికేట్ ఇలా అప్లై చేసుకోండి ఈజీ ప్రాసెస్

0
99

ఈ రోజుల్లో ఆధార్ కార్డ్ ఎంత ముఖ్యమో అలాగే పాన్ కార్డు కూడా చాలా ముఖ్యం.. అయితే పాన్ కార్డు బ్యాంకు ఖాతా ఓపెన్ చేసే సమయంలో ఇవ్వాల్సిందే , అలాగే 50 వేల కంటే ఎక్కువ నగదు ఖాతాలో జమ చేయాలి అన్నాపాన్ నెంబర్ ఉండాల్సిందే.
ఇక పాన్ కార్డు ఐడీ కార్డుగా కూడా ఉపయోగించుకోవచ్చు, అయితే పాన్ కార్డు పోతే ఎలా అప్లై చేయాలి, మళ్లీ ఎన్ని రోజులకి వస్తుంది అనే డౌట్ చాలా మందికి ఉంటుంది. మరి ఎలా అనేది చూద్దాం.

డూప్లికేట్ పాన్ కార్డుకు ఎలా దరఖాస్తు చేయాలంటే, మీరు ఆన్ లైన్ లో డూప్లికేట్ పాన్ కార్డ్ అప్లై చేసుకోవచ్చు.
https://www.tin-nsdl.com/ ఇలా వెబ్ సైట్ ఓపెన్ చేయండి
హోమ్ పేజీలో Services ఆప్షన్ క్లిక్ చేయండి
అక్కడ పాన్ అనే ఆప్షన్ సెలక్ట్ చేయండి
Reprint of PAN Card పైన క్లిక్ చేయండి.
వెను వెంటనే కొత్త పేజీ వస్తుంది
ఇక మీ పాన్ కార్డు నెంబర్ ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేసి
మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి
ఫైనల్ గా క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయాలి.

ఇక అక్కడ పాన్ కార్డు రీ ప్రింట్ అనే ఆప్షన్ వస్తుంది. అక్కడ ధరఖాస్తు చేస్తే మీకు ఓ టోకెన్ నెంబర్ మొబైల్ కు మెసేజ్ వస్తుంది
ఇక అక్కడ పాన్ కార్డు మళ్లీ అప్లై చేసి మీరు పేమెంట్ చేసిన తర్వాత, మీకు కొద్ది రోజుల్లో ఇంటికి కొరియర్ వస్తుంది పాన్ కార్డ్.