మనం భోజనం చేసే సమయంలో కొన్ని విషయాలు గుర్తు ఉంచుకోవాలి, ఏ రోజు మనం మంచంపై భోజనం చేయకూడదు, కాలిపై ప్లేట్ పెట్టుకుని అస్సలు భోజనం చేయకూడదు. భూమిపై పడిన అన్నాన్ని మళ్లీ భోజనం చేయకూడదు, అది ఆవులకి పెట్టవచ్చు లేదా మట్టిలో కలపవచ్చు.
ఇక కాకులకి పెట్టిన అన్నం అది తినకపోతే పాడేయాలి.. దానిని మనుషులు తినకూడదు, అలాగే వేరే జంతువులకి పెట్టకూడదు, ఇక కుక్కలకి పెట్టే ఆహారం మంచిగా ఉండాలి, దానికి పెడదాము అని భావించి పెట్టకుండా మనం ఏనాడు తినకూడదు, ఇది చాలా పాపం.
కాకులు కుక్కా ఆవూ వాసన చూసిన భోజనం అసలు తినకూడదు. పాలతో భోజనం చేశాక, పెరుగుతో భోజనం చేయకూడదు.
ఇక షూ చెప్పులతో భోజనం అస్సలు చేయకూడదు, ఇక తాటిచెట్లు కింద అస్సలు భోజనాలు చేయకూడదు, ఈత చెట్ల కింద కూడా భోజనాలు ఏర్పాటు చేసుకోకూడదు, ఎడమచేతితో అన్నం భుజించకూడదు..చల్లారిన అన్నాన్ని వేడిచేసి అస్సలు తినకూడదు. వృద్దులకి పెద్దలకు పెట్టాల్సిన ఆహారం ఏనాడు వారికి కాకుండా మనం తినకూడదు..