పారిపోదాం వచ్చెయ్ అన్నాడు ప్రియుడు – తల్లిదండ్రులు చెప్పిన సంబంధం చేసుకుంటానంది చివరకు దారుణం

పారిపోదాం వచ్చెయ్ అన్నాడు ప్రియుడు - తల్లిదండ్రులు చెప్పిన సంబంధం చేసుకుంటానంది చివరకు దారుణం

0
97

వారిద్దరి కులాలు వేరు దీంతో పెళ్లికి అమ్మాయి తండ్రి ఒప్పుకోలేదు, దీంతో ప్రియుడు ఆమెని మనం పారిపోయి పెళ్లి చేసుకుందాం అని చెప్పాడు.. అయినా ఆమె నో చెప్పింది ..మా నాన్న అమ్మ మాట వింటాను నేను వారు చెప్పిన సంబంధం పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది.. దీంతో ప్రేమించిన అమ్మాయి ఇలా ఎదురుచెప్పడంతో అతనికి కోపం పెరిగింది. ఆగ్రహంతో ఆమె చున్నీని మెడకు బిగించి చంపేశాడు.

 

తమిళనాడు రాష్ట్రంలో జరిగిన ఈ ఘటన ఒక్కసారిగా అందరిని షాక్ కి గురిచేసింది, పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టుకున్నారు ఆమె తల్లిదండ్రులు.. ఇలా దారుణం జరగడంతో కన్న తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.

 

ఇటీవల ఆమెకి ఫోన్ చేసి బయటకు రమ్మన్నాడు ప్రియుడు.. ఆమె అతనిని ఇంటికి దూరంగా వచ్చి కలిసింది.. దీంతో అతను పారిపోయి పెళ్లి చేసుకుందాం అన్నాడు.. ఆమె నో చెప్పింది, దీంతో ఆగ్రహం తన్నుకొచ్చింది. రెండేళ్లు ప్రేమించి పెళ్లికి ఒప్పుకోవడం లేదేంటని నిలదీసి ఆమెతో గొడవ పడ్డాడు. చున్నీతో మెడకు ఉరి బిగించి చంపేశాడు. ఇక అక్కడ ఆమెని వదిలేసి పారిపోయాడు.. స్ధానికులు చెప్పడంతో ఆమెని వెంటనే ఆస్పత్రికి తల్లిదండ్రులు తీసుకువెళ్లారు.. కాని ఆమె అప్పటికే చనిపోయింది, ఆ ప్రియుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.