పాతబస్తీలో వ్యభిచార గృహంపై పోలీసుల దాడి- భార్య భర్తలే

పాతబస్తీలో వ్యభిచార గృహంపై పోలీసుల దాడి- భార్య భర్తలే

0
108

వ్యభిచారం మళ్లీ కొన్ని ఏరియాల్లో పెరుగుతోంది, సీక్రెట్ గా వేరే ప్రాంతాల నుంచి అమ్మాయిలని తీసుకువచ్చి సెక్స్ రాకెట్ నడుపుతున్నారు, అద్దెకు ఇళ్లు తీసుకుని ఇలాంటి దందా చేస్తున్నారు, అయితే పెళ్లి అయిన యువతులని తీసుకువస్తున్నారు కొందరు, ఇంకొందరు కాలేజీ అమ్మాయిలని తీసుకువస్తున్నారు.

ఆర్దిక అవసరాల కోసం వీరు ఈ వృత్తిలోకి దిగుతున్నాము అని చెబుతున్నారు, తాజాగా
పాతబస్తీలోని కాలపత్తర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నవాబ్ సాబ్ కుంట బషారత్ నగర్ ప్రాంతంలో ఓ ఇంట్లో వ్యభిచారం జరుగుతుంది అనే సమాచారంతో కాలపత్తర్ పోలీసులు దాడి చేశారు.

ఇక్కడ ఇద్దరు నిర్వాహకులు ఓ విటుడు ఆ సమయంలో ఇంటిలో ఉన్నారు, అంతేకాదు 7 మంది అమ్మాయిలు కూడా ఉన్నారు .. భార్య భర్తలైన మిస్కిన్, తరన్నుమ్ గత కొన్ని రోజుల ఈ వ్యభిచార కేంద్రాన్ని నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలియజేశారు. ఈ అమ్మాయిల్లో ఇద్దరు వెస్ట్ బెంగాల్ ఒకరు కర్ణాటక, మిగిలిన వారు స్ధానిక ఏరియా వారు అని తెలియచేశారు.