దీప వెంకటేష్ ఇద్దరూ భార్య భర్తలు, వెంకటేష్ మంచి ఉద్యోగం చేస్తున్నాడు… అయితే వివాహం కాకముందు నుంచి వెంకటేష్ కు మరో మహిళతో అక్రమ సంబంధం ఉంది, ఈ సమయంలో భార్యకు తెలియకుండా జాగ్రత్త పడ్డాడు, కాని ఆమెకి ఈ విషయం తెలియడంతో భర్తని నిలదీసింది …అతనిలో ఎలాంటి మార్పు లేదు, చివరకు అత్తమామలు అమ్మనాన్నకు చెప్పి పంచాయతీ పెట్టించింది భార్య.
చివరకు భర్త పంచాయతీలో మాత్రం బాగానే ఉంటాను అన్నాడు, కాని అతను ఇంటికి వెళ్లిన తర్వా త కొద్ది రోజులు బాగానే ఉన్నా, ఆ ప్రియురాలితో అఫైర్ కొనసాగిస్తూనే ఉన్నాడు, చివరకు భార్య తన పరువు తీసింది అనే పగ పెంచుకున్నాడు భర్త. ఆమెని వదలకూడదు అని పగ పెంచుకున్నాడు..
భార్యకి స్లో పాయిజన్ ఇచ్చి నిద్రలోకి జారుకునేలా చేసి చంపేశాడు, దీంతో అల్లుడిపై అనుమానంతో కేసు నమోదు చేశారు అత్త మామలు, దీంతో పోలీసులు వారి స్టైల్లో విచారణ చేయగా భార్యని చంపింది తానే అని నిజం ఒప్పుకున్నాడు.