పెళ్లి అయిన మూడు గంటలకే వరుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

పెళ్లి అయిన మూడు గంటలకే వరుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

0
90

ఇప్పుడు కరోనా దెబ్బకు వివాహాలు కూడా చాలా మంది వాయిదా వేసుకుంటున్నారు.. ముందు అనుకున్న ముహూర్తాలు అయినా, ఇంటి దగ్గర పందిరి వేసి టెంట్లు వేయకుండా చేసుకుంటున్నారు. ఇంట్లోనే మూడు ముళ్లు వేయించేస్తున్నారు పెద్దలు.

మొత్తానికి దారుణమైన పరిస్దితి కనిపిస్తోంది, అయితే తాజాగా ఓ వ్యక్తి వివాహం చేసుకున్నాడు , ఆమె అతను కూడా బాగా చదువుకున్న వ్యక్తులు ఈ సమయంలో అక్కడ 100 మందిని ఇంటికి పిలిచి విందు ఇచ్చారు, వెంటనే పోలీసులకు విషయం తెలిసింది.

అక్కడ మంటపం నుంచి పెళ్లి కొడుకుని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు, ఈ సమయంలో పెళ్లి కూతురు నిలువరించింది, ఆమెకి సమాధానం చెప్పారు పోలీసులు.. కేవలం ఏడు లేదా పది మందిని మాత్రమే వివాహం ఫంక్షన్లకు పిలవాలి అని చెప్పాము, ఇక్కడ ఇంత మంది ఎందుకు వచ్చారు అని అతనిపై కేసు నమోదు చేశారట.