ఈ లాక్ డౌన్ వేళ కూడా చాలా మంది వివాహాలు చేసుకుంటున్నారు, మరీ ముఖ్యంగా కొందరు తక్కువ మందిని పిలిచి కుటుంబ సభ్యుల మధ్య వివాహం చేసుకుంటున్నారు.. అయితే ఈ లాక్ డౌన్ వేళ 50 మంది కంటే ఎక్కువ మంది రాకుండా వారు కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.. ఇంకొందరు మాత్రం ఎక్కువ మందిని పిలిచి నిబంధనలు పాటించక అరెస్ట్ కూడా అవుతున్నారు.
ఇక తాజాగా మధ్యప్రదేశ్ లో ఇక్కడ ఓ జంట పెళ్లి చేసుకోగా ఆ జంటపై పోలీసులు కేసు నమోదు చేశారు. వధువు వరుడు తో పాటు వారి తల్లిదండ్రుల పై కూడా కేసు నమోదు చేశారు..ప్రభుత్వం విధించిన నిబంధనల ప్రకారం ఈ శుభకార్యం జరపడానికి ముందుగా రెవెన్యూ అధికారుల అనుమతి తీసుకోవడంతో పాటు కేవలం 50 మంది మాత్రమే హాజరుకావాలని నిబంధన ఉంది.
కాని 150 మందిని ఆహ్వనించారు…ఇలా చాలా మంది ఫిర్యాదులు చేయడంతో వారిపై కేసు నమోదు చేశారు పోలీసులు, దీంతో పెళ్లి అయిన వెంటనే ఆ జంటపై కేసు పెట్టారు.