ఈ మధ్య చాలా మంది పెళ్లి అనే పేరుతో మోసం చేస్తున్నారు, వారికి గాలం వేసి కోట్లు కూడా కాజేస్తున్న వారిని మనం చూస్తున్నాము..పెళ్లి పేరుతో ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్కు గాలమేసిన ఓ మాయలాడి కోటి రూపాయలతో ఉడాయించింది, దీంతో అబ్బాయిలు ఎంత జాగ్రత్తగా ఉండాలో ఓ ఉదాహరణగా తెలుస్తోంది.
పెళ్లి సంబంధాల కోసం వెతుకున్న ఇంజినీర్ కు ఓ పెళ్లి సంబంధాల సైట్లో పల్లవి పేరుతో ఓ మహిళ పరిచయమైంది. తనది జూబ్లీహిల్స్ అని, వైద్యురాలినని చెప్పి నమ్మించింది. నెమ్మదిగా పరిచయం పెరిగాక తన పథకాన్ని అమలు చేసింది.
తనకు వారసత్వ ఆస్తి వస్తుంది అని దాని రిజిస్ట్రేషన్ కోసం నగదు కావాలి అని కోరింది, ఇక పెళ్లి చేసుకుంటుంది అని అతను నమ్మాడు, ఆమెకి నగదు పంపాడు, సుమారు ఇలా కోటి రూపాయల వరకూ పంపాడు, తర్వాత ఆమె రెస్పాండ్ అవ్వడం లేదు, దీంతో మోసపోయాను అని తెలిసి ఇంజినీర్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. ఏకంగా ఈ మోసంలో ఆమె భర్త అత్త కుటుంబ సభ్యులు ఉన్నారు అని తెలిసి షాకయ్యారు అందరూ.