పెళ్లి వేడుకను అడ్డుకున్నారని ఎమ్మార్వో పై పోలీసులపై దాడి ఎక్కడంటే

పెళ్లి వేడుకను అడ్డుకున్నారని ఎమ్మార్వో పై పోలీసులపై దాడి ఎక్కడంటే

0
94

ఈ కరోనా వేళ అతి కొద్ది మందితోనే వివాహాలు ఫంక్షన్లు చేసుకోవాలి అని పరిమిత సంఖ్యలోనే పిలుచుకోవాలి అని అధికారులు పోలీసులు చెబుతున్నా కొందరు ఎలాంటి మాట వినడం లేదు.. అయితే ఇలాంటి వారిని అధికారులు పోలీసులు ప్రశ్నిస్తే వారిపైనే తిరగబడుతున్నారు, తాజాగా ఇలాంటి దారుణ ఘటన జరిగింది.

 

ఒడిశాలో ఓ పెళ్లి వేడుకలో రూల్స్ను అతిక్రమించారు. గజపతి జిల్లాలోని ఆర్.ఉదయగిరి మండలంలో శుక్రవారం చెలిగడ గ్రామంలో ఓ వివాహ వేడుక జరిగింది. ఇక బంధువులు అందరూ కలిసి పెళ్లి తర్వాత ఊరేగింపు వేడుకను నిర్వహించారు. పెద్ద మొత్తంలో బంధువులు, స్థానికులు ఆ వేడుకల్లో పాల్గొన్నారు. అక్కడకు పోలీసులు ఎమ్మార్వో వెళ్లారు.

 

పెళ్లిళ్లపై ఆంక్షలు ఉన్నాయని తెలియదా? అని ప్రశ్నించారు. ఊరేగింపు ఆపాలి అని అడ్డుకునే ప్రయత్నం చేశారు, దీంతో ఆ పెళ్లి బృందం రెచ్చిపోయింది.. అధికారులపై దాడికి పాల్పడ్డారు….ఎమ్మార్వోతో పాటు ఎస్ఐ, కానిస్టేబుల్స్ పై దాడి చేశారు

వారిని ఆర్.ఉదయగిరి కమ్యూనిటీ హెల్త్ సెంటర్కి తరలించి చికిత్స అందించారు. దీనిపై కేసు నమోదు చేసి వారి కోసం వెతుకుతున్నారు పోలీసులు.

 

నోట్..

చూశారుగా మన మంచి కోసం చెబుతున్నా కొందరు ఎలాంటి దారుణాలకు పాల్పడుతున్నారో.