పెళ్లయ్యాక ప్రేమలో పడిన భార్య – ప్రియుడితో భర్త పెళ్లి

పెళ్లయ్యాక ప్రేమలో పడిన భార్య - ప్రియుడితో భర్త పెళ్లి

0
71

ఈరోజుల్లో వివాహం ముందు ఎలా ఉన్నా పెళ్లి అయిన తర్వాత నా భార్య ఎవరిని ప్రేమించకుండా నా భర్త కూడా నన్ను ప్రేమించాలి అని భార్య భర్తలు భావిస్తున్నారు, ఇక పెళ్లికి ముందు ఎలాంటి ప్రేమ ఉన్నా దానిని మర్చిపోతున్నారు, అయితే పెళ్లి అయిన తర్వాత వారికి ఇద్దరు పిల్లలు ఉన్నా సరే ఆ భార్య మరొకరితో ప్రేమలో పడితే …ఇక ఆ ఇంటి మనిషి ఏం చేస్తాడు… కాని ఈ భర్త ఆ భార్య కి ఆ ప్రియుడితో పెళ్లి చేశాడు..

 

 

ఇది ఇప్పుడు అందరిని షాక్ కి గురిచేస్తోంది….ఖగారియా జిల్లాకు చెందిన సప్న భాగల్పూర్ జిల్లా సుల్తాన్ గంజ్కు చెందిన ఉత్తమ్ మండల్ అనే వ్యక్తిని ఏడేళ్ల క్రితం పెళ్లి చేసుకుంది. ఈ జంటకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, అయితే ఉత్తమ్ బంధువు రాజ్కుమార్ను ఈమె కలిసింది, ఇక వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు.

 

పెళ్లి అయినా పిల్లలు ఉన్నా ఆమె రాజ్ కుమార్ తో ప్రేమలో ఉంది. ఇక భర్తకు తెలిసింది వద్దు అని వారించాడు… అయినా ఆమె మాత్రం అతన్ని మర్చిపోలేకపోతోంది. తల్లిదండ్రులు చెప్పినా ఆమె వినలేదు.

 

సుల్తాన్గంజ్లోని దుర్గామాత ఆలయంలో రాజ్కుమార్తో తన భార్యకు వివాహం జరిపించాడు. ఇక ఆమె నవ్వుతూ తాళికట్టించుకుంది …కాని భార్య మరొకరితో ఇక వెళ్లిపోతుంది అని తెలిసి కన్నీటితో అక్షింతలు వేసి ఆశీర్వదించాడు, ఇక్కడ ఆమె భర్త కాళ్లకు నమస్కరించింది.. ఈ ఘటన చూసి అందరూ షాక్ అయ్యారు.