పెళ్లి అయిన మరుసటి రోజే ప్రియుడితో జంప్….

పెళ్లి అయిన మరుసటి రోజే ప్రియుడితో జంప్....

0
105

పెళ్లి అయిన మరుసటిరోజే ప్రియుడితో జంప్ అయింది… ఈసంఘటన చైన్నైలో జరిగింది… పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి…సేలం జిల్లాకు చెందిన పెరియస్వామి కుమారుడు రవికుమార్ కు చిన్న మసముద్రానికి చెందిన పూమారై కుమార్తె సత్యకు ఇటీవలే పెళ్లి అయింది… అయితే పెళ్లి అయిన మరుసటి రోజు దుకాణం దగ్గరకు వెళ్తానని చెప్పిన సత్య ఎంత సేపు అయినా రాకపోవడంతో అనుమానంతో రవికుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు…

ఈ క్రమంలోనే సత్య మసముద్రానికి చెందిన తన ప్రియుడిని వివాహం చేసుకుని పోలీసులను ఆశ్రయించింది… తనకు రక్షణ కల్పించాలంటూ కోరింది… ఇక సమాచారం అందుకున్న రవికుమార్ తల్లిదండ్రులను తీసుకుని పోలీస్ స్టేషన్ కు వచ్చాడు… తాను వల్లరసును రెండు సంవత్సరాలుగా ప్రేమిస్తున్నానని ఇష్టపూర్వకంగానే వివాహం చేసుకున్నానని తెలిపింది…

తన పెళ్లికి అంగీకరించని తల్లిదండ్రులు బలవంతంగా రవికుమార్ కు ఇచ్చివివాహం చేశారని తెలిపింది… వివాహం అయిన సందర్భంగా కట్టిన తాళి అలాగే నగలను రవికి ఇచ్చింది… పెళ్లికి అయిన ఖర్చుకూడా చెళ్లిస్తానని సంతకం పెట్టి వెళ్లింది సత్య.