పెళ్లికి ముందు సరదాగా గడపటానికి పొలానికి వెళ్లారు దారుణం జరిగింది

పెళ్లికి ముందు సరదాగా గడపటానికి పొలానికి వెళ్లారు దారుణం జరిగింది

0
123

సెల్ఫీ పిచ్చి ముదిరి తమ ప్రాణాలు పోయేలా చేస్తోంది, ఎంత వద్దు అని వారిస్తున్నా కొన్ని డేంజర్ స్పాట్లలో సెల్ఫీ కోసం ట్రై చేసి తమ ప్రాణాలను సైతం పొగొట్టుకుంటున్నారు.. తాజాగా తమిళనాడులో ఇలాంటి దారుణం జరిగింది. పట్టాభిరామ్ ప్రాంతంలోని గాంధీనగర్కు చెందిన టి మెర్సీ స్టెఫీ, అదే ప్రాంతంలోని నవజీవన్ నగర్కు చెందిన డి అప్పూతో ఇటీవల నిశ్చితార్థమైంది. ఎంగేజ్ మెంట్ అవడంతో వీరిద్దరూ చాలా సరదాగా సినిమాలు షికార్లకు వెళుతున్నారు.

అయితే వీరిద్దరూ సరదాగా గడిపేందుకు వందలూరు మింజూరు రోడ్డులో ఉన్న వారి పొలానికి వెళ్లారు, సరదాగా గంట మాట్లాడుకున్నారు చెట్ల దగ్గర పొలాల దగ్గర ఫోటోలు తీసుకున్నారు, ఈ సమయంలో పక్కన పాత బావి ఉండటం చూశారు. అందులో దిగేందుకు మెట్లు ఉండటంతో నెమ్మదిగా మెట్లు దిగి అక్కడ ఫోటో తీసుకున్నారు.. మరో సెల్ఫీ తీసుకుంటున్న సమయంలో ప్రమాదవశాత్తు స్టెఫీ బావిలో పడిపోయింది.

వెంటనే అప్పూ కూడా ఆమెని కాపాడేందుకు అందులో దిగాడు, వీరిద్దరి అరుపులు విన్న పొలంలో పనివారు బావిలోకి దిగి బయటకు తీశారు. అప్పు బతికాడు కాని అప్పటికే శరీరంలోకి నీరు చేరడంతో స్టెఫీ మరణించింది. ఈ ప్రమాద ఘటనతో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది