దేశంలో కరోనా కేసులు ఎంతలా వస్తున్నాయో చూస్తున్నాం, అయినా కొందరు బాధ్యతారహితంగా ప్రవర్తిస్తూ, ఇతరులకు కరోనా అంటుకోవడానికి కారకులవుతున్నారు. ఎవరికి అయినా కరోనా సోకితే సీరియస్ అయితే ఆస్పత్రికి లేదా నార్మల్ గా ఉంటే హోమ్ ఐసోలేషన్ లో ఉండాలి అని ప్రభుత్వం చెబుతోంది… కానీ కొందరు మాత్రం కరోనా సోకినా ఇంటి పట్టున ఉండకుండా రోడ్లపై తిరుగుతున్నారు.. అంతేకాదు ఫంక్షన్లకు అటెండ్ అవుతున్నారు.
మధ్యప్రదేశ్ లో ఇలాంటి ఒక వ్యక్తి చేసిన పనికి ఇప్పుడు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు…అరుణ్ మిశ్రా అనే వ్యక్తి ఓ పెళ్లికి హాజరయ్యాడు. పెళ్లికి వచ్చిన వారికి భోజనాలు వడ్డించాడు.. ఇక అందరూ ఆ విందు చేశారు, అయితే వారం అయింది ఒక్కొక్కరికి జ్వరం కరోనా లక్షణాలు వచ్చాయి. టెస్టులు చేస్తే మొత్తం 40 మందికి కరోనా అని తేలింది.
అయితే దీనిపై పోలీసులు విచారణ చేస్తే ఈ అరుణ్ అనే వ్యక్తి వల్ల కరోనా ఇలా పాకింది అని తేలింది.గత నెల 27న అరుణ్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. తనకు కరోనా ఉన్నా మరో ఇద్దరు స్నేహితులను కూడా పెళ్లికి తీసుకెళ్లాడు. ఇక ఆ ముగ్గురిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. చూశారుగా అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి.