భారత్ లో సెంచరీ కొట్టిన పెట్రోల్

Petrol , Diesel Rates Updates

0
92

దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను ఆయిల్ కంపెనీలు మరోసారి పెంచాయి. రోజురోజుకు పెరుగుతున్న రేటుతో పెట్రోల్‌ బంకుకు వెళ్లాలంటేనే భ‌య‌ప‌డే ప‌రిస్థితులు నెలకొన్నాయి. తాజాగా పెట్రోల్‌పై 27 పైసలు, డీజిల్‌పై 28 పైసలు చొప్పున పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ ధరలు సెంచరీ మార్క్ దాటి దూసుకెళ్తున్నాయి.

ముంబైలో లీటర్‌ పెట్రోల్‌ రూ.100.98, డీజిల్ రూ.92.99కు పెరిగింది. ఆంధ్రప్రదేశ్ విజయవాడలో పెట్రోల్ ధర రూ.101.52 గా ఉండగా డీజిల్ రూ. 95.91 గా ఉంది. హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర.99.32 ఉండగా లీటర్‌ డీజిల్‌ రూ.94.26 కు పెరిగింది. ఇక ఆలమూరు మండలంలో గల పెట్రోల్ బంకుల్లో బుధవారం లీటర్ పెట్రోల్ ధర రూ. 101 .41గా ఉంది.