ఫిలిప్పీన్స్ అతలాకుతలం..100కు చేరిన మృతుల సంఖ్య

Philippines death toll rises to 100

0
86

రాయ్​ తుపాను బీభత్సంతో ఫిలిప్పీన్స్​ కోలుకోలేని స్థితికి చేరింది. రెండే రోజుల్లో యావత్​ దేశాన్ని అతలాకుతలం చేసింది. వేలాది ఇళ్లు, భారీ వృక్షాలు నేలమట్టమయ్యాయి. భారీ వర్షాలు, వరదలతో పలు ప్రాంతాలు నీట మునిగాయి. ప్రజలు బిక్కుబిక్కుమంటూ తలదాచుకున్న దృశ్యాలు హృదయాలను కలచివేస్తున్నాయి. మరోవైపు.. తుపాను ధాటికి మృతి చెందిన వారి సంఖ్య 100కు చేరువైంది. పలువురి ఆచూకీ గల్లంతైంది.