పావురాల రేస్ – గాల్లోకి ఎగిరిన 10 వేల పావురాలు కాని వెనక్కి రాలేదు – ఎందుకంటే

Pigeons Race-10 thousand pigeons flew into the air but did not come back

0
106
Pigeon Racing

మనకు గుర్రాల రేస్ గురించి తెలుసు . అక్కడక్కడా కుక్కలకి, కుందేళ్లకి కూడా రేస్ పోటీలు పెడుతున్నారు. ఈ మధ్య ఇలాంటి వార్తలు వింటున్నాం. కాని తాజాగా పావురాల రేసు కూడా జరిగింది. అయితే ఇది చాలా కాస్ట్ లీ రేస్. వీటిపై బెట్టింగుల విలువ కోట్లల్లో ఉంటుందని అంటూ ఉంటారు.
బ్రిటన్ లో ఓ పావురాల రేసు సందర్భంగా అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.

రేసు కోసం గాల్లోకి ఎగిరిన 10 వేల పావురాలు ఉన్నట్టుండి అదృశ్యం అయ్యాయి. ఇలా పావురాలు గాల్లోకి ఎగిరాయి, రేసులో ముందుకు సాగాయి. కాని ఎంత సేపటికి వెనక్కి రాలేదు .దీంతో వాటి యజమానులు షాక్ అయ్యారు.

బ్రిటన్ లోని పీటర్ బరోలో 270 కిమీ పావురాల రేసు జరిగింది. సాధారణ పరిస్థితుల్లో గాల్లోకి ఎగిసిన పావురాలు నిర్దేశిత దూరాన్ని చేరుకుని, తిరిగి తమ యజమానుల చెంతకు వస్తాయి. కాని ఒక్క పావురం కూడా వెనక్కి రాలేదు. అయితే అన్నీ ఇలా రాకపోవడంతో షాక్ అయ్యారు వాటి యజమానులు. అయితే అవి దారి తప్పి ఉంటాయి అని భావిస్తున్నారు. పాపం మా పావురాలు గుంపులుగా ఎక్కడైనా కనిపిస్తే వాటికి ఆహరం పెట్టండని అంటున్నారు వాటి ఓనర్స్. ఇక ఇలాంటి పావురాల కాళ్లకి రంగు రంగుల రింగ్స్ ఉంటాయి. మంచి స్ట్రాంగ్ గా ఉంటాయి.