పైనాపిల్ లో బాంబులు పెట్టి ఏనుగుకి తినిపించారు చివరకు దారుణం

పైనాపిల్ లో బాంబులు పెట్టి ఏనుగుకి తినిపించారు చివరకు దారుణం

0
104

మనుషులు కొందరు ఎదుగుతారు కాని మూర్ఖంగా ప్రవర్తిస్తారు, కొందరు నోరు లేని జీవాలపై తమ ప్రతాపం చూపిస్తారు, వాటిని హింసించి మరీ చంపేస్తారు, జంతువులు అంత ఈజీగా మోసం చేయవు కాని మనిషి మాత్రం వాటిని మోసం చేస్తున్నాడు, ఓ ఏనుగుని వీరు ఎంత దారుణంగా చంపారో తెలిస్తే కన్నీరు రాకమానదు.

కేరళలో చోటు చేసుకొంది ఈ ఘటన . గర్భంతో ఉన్న ఓ ఏనుగుతో మల్లప్పురం దగ్గర ఓ గ్రామంలోని ప్రజలు అత్యంత క్రూరంగా ప్రవర్తించారు. నదిపాయల్లో ఆహారం వెతుక్కుంటూ ఓ ఆడ ఏనుగు గ్రామంలోకి వచ్చింది. ఎవరీని ఏమీ చేయలేదు, కాని ఈ సమయంలో అక్కడ కొందరు గ్రామస్తులు పైనాపిల్ తెచ్చి అందులో పేలుడు బాంబులు పెట్టారు.

దానిని ఏనుగుకి అందించారు.. పాపం ఆ ఏనుగు ఆ విషయం తెలియక అది తినేసింది..
ఆ పండు భారీ చప్పుడుతో పేలింది. ఆ మూగజీవి నోటివెంట రక్తం ధారగా కారింది. అంత బాధలో కూడా అది తనను మోసం చేసిన మనుషులపై దాడిచేయలేదు. అక్కడ నుంచి వెళ్లిపోయింది, ఆమంటకి అది నదిలోకి దిగింది, ఆ గాయంపై ఈగలు కూడా ముసిరాయి, చివరకు ఆ బాధతో అక్కడే చనిపోయింది ఆ ఏనుగు.