పోలీసులకు తాను చేసిన దారుణం మొత్తం చెప్పిన మహ్మద్

పోలీసులకు తాను చేసిన దారుణం మొత్తం చెప్పిన మహ్మద్

0
77

వెటర్నరీ వైద్యురాలు ప్రియాంకరెడ్డి హత్య కేసులో సూత్రదారి అయిన మహ్మద్ పాషా పూర్తిగా ఏం జరిగిందో పోలీసులకు చెప్పాడు.ఎప్పటిలాగే బుధవారం కూడా ప్రియాంక రెడ్డి టోల్ ప్లాజా దగ్గరకు వచ్చింది. అక్కడ బండి పార్క్ చేసి క్యాబ్లో వెళ్లింది. ఆమె బైక్ పార్క్ చేయడం

చూశాడు మహ్మద్ పాషా .. ఆమెని ఎలాగైనా అత్యాచారం చేయాలి అని అనుకున్నాడు. సులువుగా ఆమెపై వల వేద్దాం అని పన్నాగం వేశాడు..

ఆమె బైక్ కు కావాలనే టైర్ కు పంక్చర్ చేసి ఏమీ తెలియనట్లు ఉన్నారు.. రాత్రి 9 గంటలకు ప్రియాంక రావడం గమనించారు.

బండి పంక్చర్ పడింది అని ఆమె దగ్గరకు వెళ్లి చెప్పారు…అప్పటికే చీకటి పడిపోవడం.. ఇంతలో సాయం చేస్తామని మహ్మద్ పాషా అండ్ కో ముందుకు వచ్చారు. వారి ప్రవర్తనపై ప్రియాంకకు అనుమానం కలిగింది. కానీ బండి పంక్చర్ కావడం వల్ల ఏమీ చేయలేకపోయింది. ఆమె బండి పంక్చర్ వేసుకురమ్మని ఓ క్లీనర్ కి ఇచ్చి మహ్మద్ పంపాడు.20 నిమిషాలకు వెనక్కి వచ్చి పంక్చర్ షాపులు లేవు అన్నాడు. మరోసారి వేరే చోటికి పంపాడు ఈలోపు ఆమెని ముగ్గురు పట్టుకుని టోల్ ప్లాజా వెనుక ఉన్న నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లారు.. అక్కడే ఆమెకి ఊపిరాడకుండా చేశారు.

ఆమెని రేప్ చేసి లారీలు అడ్డుపెట్టి ఆమెని దుప్పట్లో చుట్టి లారీలో ఎక్కించుకున్నారు.. ఓ బంకు దగ్గర పెట్రోల్ పోసుకుని ఆమెని 25 కిలోమీటర్ల తీసుకువెళ్లి ఆమెపై పెట్రోల్ పోసి చివరకు కాల్చేశారు. తెల్లవారుజామున ఆమె శవం కాలిందా లేదా అనేది చూసుకుని తిరిగి వారి ఇంటికి వెళ్లిపోయారు ఈ దుర్మార్గులు.