కొందరు పోలీసులు చేసే సేవ మాములిది కాదు, వారు దేశానికి పౌరులకి ఎంతో కమిట్మెంట్ తో సేవ చేస్తారు, ముందు డ్యూటీ తర్వాత కుటుంబం అనే పోలీసులు కూడా చాలా మంది ఉన్నారు, అయితే తెలివిగా కేసులు డీల్ చేసే పోలీసులు ఉంటారు.
ఇలాంటి ఓ పోలీస్ గురించి చర్చ జరుగుతోంది. హరియాణా రాష్ట్రంలోని బుటానా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. బుటానా దగ్గరలో ఉన్న సోనిపట్ జింద్ రోడ్డు పక్కన కొందరు దుండగులు తమ కారును పార్క్ చేసి రోడ్డుపైనే మద్యం తాగుతున్నారు. అక్కడ డ్యూటీలో ఉన్నారు కానిస్టేబుల్ కఫ్తాన్ సింగ్
రవీందర్ సింగ్.. ఈ సమయంలో వారిని వీరు ఇద్దరు నిలువరించారు.
దీంతో ఆ మందుబాబులు కానిస్టేబుల్స్ పై దాడి చేశారు, ఈ ఘర్షణలో రవీందర్ సింగ్, కప్తాన్ సింగ్ అక్కడికక్కడే మరణించారు… చనిపోయే ముందు రవీందర్ సింగ్ తన చేతిపై దుండగుల కారు రిజిస్ట్రేషన్ నంబర్ని రాసుకున్నాడు. చివరకు పోలీసులు అతని చేయి పరిశీలిస్తే కారు నెంబర్ ఉంది, చివరకు నిందితులు ఈజీగా దొరికారు…కానిస్టేబుల్ రవీందర్ సింగ్ చూపిన సమయస్ఫూర్తి అభినందనీయం. ఈ కేసులో ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.