అమ్మాయిని ప్రేమించి మోసం చేయాలనుకున్న వ్యక్తిని పోలీసులు ఏం చేశారంటే

అమ్మాయిని ప్రేమించి మోసం చేయాలనుకున్న వ్యక్తిని పోలీసులు ఏం చేశారంటే

0
88

నాలుగు సంవత్సరాలుగా ఓ యువతిని యువకుడు ప్రేమించాడు పెళ్ళి చేసుకుంటానని నమ్మించాడు తీరా యువతి పెళ్ళి మాట ఎత్తే సరికి తప్పించుకుని తిరుగుతున్నాడు… యువతి ఫిర్యాదుతో పోలీస్ స్టేషన్ లో పోలీసులు వివాహం చేశారు.. ఈ సంఘటన చెన్నైలోని అనకాపుత్తూరులో జరిగింది…

లేబర్ కాలనీకి చెందిన ఓ యువతీ యువకుడు నాలుగు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు ఇటీవలే ఆ యువతి పెళ్ళి మాట ఎత్తడంతో యువకు తప్పించుకుని తిరుగుతున్నారు… దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసునమోదు చేసుకుని విచారణ చేపట్టారు…

విచారణలో ఆ వ్యక్తి విదేశాలకు వెళ్తున్నారని సమాచారం అందడంతో వెంటనే పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా ఆమె అందంగాలేదని చెప్పాడు దీంతో పోలీసులు తమదైన శైలిలో ఒప్పించి వారి పోలీస్ స్టేషన్ లోను వివాహం చేశారు… ఇష్ట పూర్వకంగా వివాహం చేసుకున్నామని వారిద్దరి వద్ద స్టేట్ మెంట్ తీసుకుని పంపించారు పోలీసులు…