పోలీస్ స్టేషన్ లోనే దుకాణం పెట్టిశారు…

పోలీస్ స్టేషన్ లోనే దుకాణం పెట్టిశారు...

0
97

అనంతపురం జిల్లా హిందూపురంలోని పోలీస్ స్టేషన్ లో దారుణం జరిగింది.. ఇద్దరు కానిస్టేబుళ్లు నిర్వాహం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది… పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి… ఇద్దరు కానిస్టేబుళ్లు ఏకంగా పోలీస్ స్టేషన్ లో మద్యం తాగా అడ్డంగా బుక్ అయ్యారు..

కానిస్టేబుల్ నూర్ మహ్మద్ తిరుమలేశ్ స్టేషన్ లో మద్యం తాగి సీసీ కెమెరాకు చిక్కారు… ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు ఇటీవలే సీజ్ చేసిన కర్నాటక మద్యం బాటిళ్లను పోలీస్ స్టేషన్ లో పెట్టారు… ఆ మద్యం బాటిళ్లను ఇద్దరు కానిస్టేబుల్ తీసుకుని తాగారు… .

ఇక దీనిపై జిల్లా ఎస్పీ సీరియస్ అయ్యారు… విచారణకు ఆదేశించారు మరో వైపు ఇద్దరు కానిస్టేబుల్స్ మరోలా మాట్లాడుతున్నారు… మూడు నెలలుగా లాక్ డౌన్ విధుల్లో ఉంటున్నామని తమకు ఒక గదిని కేటాయించారని తెలిపారు… అలాగే తాము తాగింది సీజ్ చేసిన లిక్కర్ కాదని అంటున్నారు…